

జీ-7 సదస్సులో ఫోటో కోసం ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ తనను పదేపదే కోరిందని అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలను మెలోనీ ఇటీవల ఖండించిన సంగతి తెలిసిందే. అయితే ఈ వివాదాన్ని మరోసారి తెరపైకి తీసుకొస్తూ ట్రంప్ తన సోషల్ మీడియా వేదిక ట్రూత్ సోషల్‌లో కొత్త పోస్టు చేశారు. ఫ్రాన్స్‌లో జరిగిన సదస్సులో ఫోటో కోసం మెలోనీ పలుమార్లు అభ్యర్థించారని ఆయన మరోసారి ఆరోపించారు.
తన పోస్టులో ట్రంప్, మెలోనీ ప్రజాదరణ తగ్గుతోందని పేర్కొంటూ, ఇరాన్ అణ్వాయుధ కార్యక్రమాన్ని అడ్డుకునే విషయంలో అమెరికాకు ఆమె పూర్తి మద్దతు ఇవ్వలేదని విమర్శించారు. నాటో దేశాలు కూడా అమెరికాకు అవసరమైన సహకారం అందించలేదని ఆరోపించారు. ఇటలీతో పాటు నాటో మిత్రదేశాల భద్రత కోసం అమెరికా భారీగా ఖర్చు చేస్తున్నప్పటికీ తగిన సహకారం లభించలేదని పేర్కొన్నారు. ఇరాన్‌పై అమెరికా విజయానంతరం మళ్లీ అమెరికాతో సన్నిహిత సంబంధాలు కోరుకుంటున్నారని మెలోనీపై ట్రంప్ వ్యాఖ్యానించారు.
















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!