

ఓటుకు నోటు కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విదేశీ పర్యటనకు ఏసీబీ ప్రత్యేక కోర్టు షరతులతో కూడిన అనుమతి ఇచ్చింది. ఈ నెల 17 నుంచి సెప్టెంబర్ 10 వరకు యూకే, అమెరికా, జర్మనీ, చైనా దేశాల్లో పర్యటించేందుకు అనుమతిస్తూ, కోర్టు కస్టడీలో ఉన్న ఆయన పాస్‌పోర్టులను తాత్కాలికంగా విడుదల చేయాలని ఆదేశించింది. రాష్ట్రానికి పెట్టుబడులు ఆకర్షించేందుకు ఈ పర్యటన చేపడుతున్నట్లు ఆయన తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు.
అయితే కోర్టు పలు షరతులు విధించింది. రూ.1 లక్ష వ్యక్తిగత బాండ్‌తో పాటు ఒక ష్యూరిటీ సమర్పించాలని ఆదేశించింది. విదేశీ పర్యటనకు సంబంధించిన పూర్తి ప్రయాణ వివరాలు, బస చిరునామాలు, సంప్రదింపు నంబర్లు కోర్టుకు ఇవ్వాలని పేర్కొంది. అలాగే సెప్టెంబర్ 18లోగా పాస్‌పోర్టులను తిరిగి సమర్పిస్తానని అఫిడవిట్ దాఖలు చేయాలని సూచించింది. అఫిడవిట్ సమర్పించిన తరువాత పాస్‌పోర్టులను తాత్కాలికంగా అప్పగించాలని ప్రాంతీయ పాస్‌పోర్టు అధికారికి కోర్టు ఆదేశాలు జారీ చేసింది.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!