

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రెండోసారి పదవిలోకి వచ్చిన తర్వాత ఉక్రెయిన్–రష్యా యుద్ధాన్ని ముగించేందుకు చేసిన ప్రయత్నాలపై రెజీమ్ చేంజ్ అనే పుస్తకం కీలక విషయాలను వెలుగులోకి తీసుకువచ్చింది. రచయితలు మ్యాగీ హాబర్మాన్, జొనాథన్ స్వాన్ రచించిన ఈ పుస్తకం ప్రకారం, ప్రమాణస్వీకారం చేసిన కొద్ది రోజులకే ట్రంప్ ఓవల్ ఆఫీసులో కీలక సమావేశం నిర్వహించారు. ఆ సమావేశంలో రిటైర్డ్ లెఫ్టినెంట్ జనరల్ కీత్ కెలాగ్ సమర్పించిన ప్రణాళికలో యుద్ధ విరమణ పర్యవేక్షణ కోసం విదేశీ సైన్యాన్ని వినియోగించే ప్రతిపాదన ఉంది. ఫ్రాన్స్, బ్రిటన్, నెదర్లాండ్స్ వంటి దేశాల నుంచి బలగాలను పంపే ఆలోచన కూడా ఇందులో భాగంగా ఉంది.
అయితే, నాటో దేశాల సైన్యాన్ని పంపితే రష్యా రెచ్చగొట్టబడుతుందని ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రత్యామ్నాయంగా భారత్, సౌదీ అరేబియా వంటి ఐరోపాయేతర దేశాల బలగాలను పంపించాలని సూచించారు. కానీ ట్రంప్ ఈ ప్రతిపాదనను ఖండిస్తూ, భారత్ ఇలాంటి వ్యవహారాల్లో పాల్గొనదని వ్యాఖ్యానించినట్లు పుస్తకం పేర్కొంది. అలాగే ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీపై కూడా ట్రంప్ తీవ్ర విమర్శలు చేసినట్లు ఇందులో వెల్లడైంది.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!