

తిరుమల శ్రీవారి ఆలయం ఉత్తర భాగంలో ఉన్న పవిత్ర స్వామి పుష్కరిణిలో ఆగస్టు 1 నుంచి మరమ్మతు పనులు చేపట్టనున్నట్లు టీటీడీ ప్రకటించింది. ప్రతి ఏడాది శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు ముందు నిర్వహించే సంప్రదాయ నిర్వహణలో భాగంగా ఈ పనులు చేపడుతున్నట్లు తెలిపింది. టీటీడీ వాటర్ వర్క్స్ విభాగం ఆధ్వర్యంలో ఆగస్టు నెలంతా మరమ్మతులు కొనసాగనున్నాయి.
భారీ వర్షాలు, తుఫాన్లను దృష్టిలో ఉంచుకుని ముందస్తు జాగ్రత్త చర్యగా సెప్టెంబర్ 1 నుంచి 10 వరకు కూడా పుష్కరిణిని మూసివేయనున్నారు. దీంతో ఆగస్టు 1 నుంచి సెప్టెంబర్ 10 వరకు మొత్తం 40 రోజుల పాటు పుష్కరిణి హారతి రద్దు కానుండగా, భక్తులకు పుష్కరిణిలో స్నానానికి అనుమతి ఉండదని టీటీడీ స్పష్టం చేసింది. సెప్టెంబర్ 15 నుంచి ప్రారంభమయ్యే శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు ముందే అన్ని పనులను పూర్తి చేసి పుష్కరిణిని తిరిగి భక్తులకు అందుబాటులోకి తీసుకురానున్నట్లు అధికారులు తెలిపారు. ఈ కాలంలో భక్తులు టీటీడీ సూచనలను పాటించి సహకరించాలని విజ్ఞప్తి చేశారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!