

కాంగ్రెస్ పార్టీని వీడే ప్రసక్తే లేదని మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీ స్పష్టం చేశారు. కార్యకర్తలు, అభిమానుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కొండా సురేఖది, తనది ఒకే మాట అని, తమ కూతురిది మాత్రం వేరే మాట అని అన్నారు. తమ కుమార్తె ‘ప్లాన్ బీ’ ఏంటో తనకు తెలియదని, ఆమెకు తమకు సంబంధం లేదని వ్యాఖ్యానించారు. పదవులు ఉంటాయని, పోతాయని.. ఇచ్చిన మాటపై నిలబడటమే ముఖ్యమని పేర్కొన్నారు.
రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేసే వరకు కాంగ్రెస్‌లోనే ఉండి పోరాడతామని కొండా మురళీ తెలిపారు. తమ కుటుంబం కాంగ్రెస్ పార్టీకి విధేయంగా ఉంటుందని, పార్టీ మారతామంటూ వస్తున్న వార్తల్లో నిజం లేదన్నారు. తన కుమార్తె వ్యాఖ్యలపై మంత్రి కొండా సురేఖతో క్షమాపణ చెప్పించాలని తాను కోరినట్లు తెలిపారు. తాను ఎక్కడైనా భూకబ్జా చేసినట్లు నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానని సవాల్ చేశారు. పదవుల కంటే నమ్మకం, కార్యకర్తలే ముఖ్యమని, రాహుల్ గాంధీ నాయకత్వంలో కాంగ్రెస్ కోసం పనిచేస్తామని స్పష్టం చేశారు.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!