

నార్త్ కరోలినాలోని మోరిస్విల్లే నగరంలో ట్రయాంగిల్ తెలంగాణ అసోసియేషన్ (TTGA) ఆధ్వర్యంలో ఫాదర్స్ డే మీట్ & గ్రీట్ కార్యక్రమం ఉత్సాహభరితంగా జరిగింది. సంఘ సభ్యులు, కుటుంబాలు, స్పాన్సర్లు, కమ్యూనిటీ నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. రియల్ ఎస్టేట్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఫైనాన్షియల్ సర్వీసెస్ రంగాలకు చెందిన నిపుణులు తమ అనుభవాలు, పరిశ్రమలోని అవకాశాలు, తాజా పరిణామాలపై అవగాహన కల్పించారు. సత్య పుల్లఖండం, నర్సా గడ్డం, వీరూ గన్నె, బాలా కామోజు, శివ మాదాల, రాధేష్ గుర్రాల, ప్రవీణ్ చక్రరాజ్, వెంకట్ కుర్రా, రాజ్ కొల్లిపర, గౌరీ శంకర్ పాల్గొని తమ అభిప్రాయాలను పంచుకున్నారు.

భాస్కర్ వేణేపల్లి, డాక్టర్ పవన్ ఎర్రమ్షెట్టి ప్రసంగాలు కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. తండ్రి ప్రేమ, కుటుంబ విలువలను ప్రతిబింబించే పాటలు, కవితలు, సాంస్కృతిక ప్రదర్శనలు, నెట్‌వర్కింగ్ సెషన్లు హాజరైన వారిని ఆకట్టుకున్నాయి. TTGA అధ్యక్షుడు శ్రీధర్ అంచూరి నాయకత్వంలో నిర్వహించిన ఈ కార్యక్రమం సంఘ ఐక్యత, సాంస్కృతిక వారసత్వ పరిరక్షణ, కుటుంబ బంధాల బలోపేతానికి వేదికగా నిలిచింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!