
జనరల్

శాశ్వత శాంతి కోసం అమెరికా–ఇరాన్ మధ్య జరగాల్సిన చర్చలు ప్రారంభ దశలోనే వాయిదా పడ్డాయి. స్విట్జర్లాండ్‌లోని జెనీవాలో జరగాల్సిన సమావేశాలు లెబనాన్‌లో ఇజ్రాయెల్–హెజ్‌బొల్లా మధ్య మళ్లీ దాడులు జరగడంతో నిలిపివేయబడ్డాయి. ఈ ఘర్షణల కారణంగా ఎంవోయూ అమలుపై అనిశ్చితి నెలకొన్నప్పటికీ, మధ్యవర్తుల ప్రయత్నాలతో ఇజ్రాయెల్, హెజ్‌బొల్లా తాత్కాలిక కాల్పుల విరమణకు అంగీకరించాయి.
లెబనాన్‌లో జరిగిన దాడుల్లో ఇరువైపులా మరణాలు సంభవించాయి. మరోవైపు హర్మూజ్ జలసంధి తెరిచినప్పటికీ నౌకల రిజిస్ట్రేషన్ తప్పనిసరి చేస్తూ ఇరాన్ కొత్త నిబంధనలు అమలు చేసింది. తదుపరి చర్చలు రాబోయే రోజుల్లో జరగనున్నట్లు ఇరాన్ విదేశాంగ శాఖ తెలిపింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!