

దేశవ్యాప్తంగా చారిత్రక సంపద పరిరక్షణతో పాటు విద్యారంగంలో ఆధునిక సాంకేతికతను ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపడుతోందని లోక్‌సభలో వెల్లడించింది. ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురాం రెడ్డి అడిగిన ప్రశ్నలకు సమాధానంగా కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్, విద్యాశాఖ సహాయ మంత్రి జయంత్ చౌదరి ప్రభుత్వ చర్యలను వివరించారు.
దేశంలో పురావస్తు సర్వే ఆఫ్ ఇండియా (ASI) ఆధ్వర్యంలో 3,688 కేంద్ర రక్షిత స్మారక చిహ్నాలు ఉన్నాయని కేంద్రం తెలిపింది. తెలంగాణలోని హైదరాబాద్ సర్కిల్ పరిధిలో చారిత్రక కట్టడాల పరిరక్షణ కోసం గత ఐదేళ్లుగా నిధులు కేటాయిస్తున్నట్లు వెల్లడించింది. 2021–22లో రూ.7 కోట్ల నుంచి 2022–23లో రూ.15.50 కోట్లకు నిధులు పెంచగా, 2025–26లో రూ.14.93 కోట్లు కేటాయించినట్లు పేర్కొంది. అలాగే 'అడాప్ట్ ఎ హెరిటేజ్ 2.0' కార్యక్రమం ద్వారా వారసత్వ కట్టడాల్లో పర్యాటక సదుపాయాలను మెరుగుపరుస్తున్నట్లు వివరించింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!