
రాజకీయాలు

తమిళ నటుడు ధనుష్ తన కుమారులు లింగా, యాత్రతో కలిసి తిరువణ్ణామలైలోని అరుణాచలేశ్వరస్వామి ఆలయాన్ని సందర్శించారు. ‘ఓం చాప్టర్ 1: ఉదిరం – ది బ్లడ్ వుడ్’ సినిమా చిత్రీకరణకు విరామం లభించడంతో సంప్రదాయ దుస్తుల్లో ఆలయానికి చేరుకున్న ఆయన ముందుగా గోశాలలో గోపూజ నిర్వహించారు. ఆవులకు అగతి ఆకులు సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు.
అనంతరం అరుణాచలేశ్వరస్వామిని దర్శించుకుని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ధనుష్ ఆలయానికి వచ్చిన విషయం తెలుసుకున్న అభిమానులు, భక్తులు భారీ సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేసి దర్శనం సజావుగా పూర్తయ్యేలా చర్యలు చేపట్టారు. ప్రస్తుతం రాజ్‌కుమార్ పెరియసామి దర్శకత్వంలో రూపొందుతున్న ‘ఓం చాప్టర్ 1: ఉదిరం – ది బ్లడ్ వుడ్’ చిత్రీకరణ తిరువణ్ణామలై పరిసర ప్రాంతాల్లో జరుగుతోంది.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!