
జనరల్

తిరుమలలో ఈ రోజు అనూహ్యంగా భారీ సంఖ్యలో భక్తులు చేరుకోవడంతో సాధారణ భక్తుల భద్రత, సౌకర్యాలు, త్వరిత దర్శనానికి టీటీడీ అత్యధిక ప్రాధాన్యం ఇస్తోందని అదనపు ఈవో సి.హెచ్. వెంకయ్య చౌదరి తెలిపారు. పాచికాల్వ గంగమ్మ గుడి సమీపంలోని క్యూ లైన్లను ఆయన పరిశీలించి, భక్తులకు మెరుగైన సేవలు అందించేందుకు యంత్రాంగం నిరంతరం పనిచేస్తోందన్నారు.
సాధారణ రోజుల్లో రోజుకు 85 వేల నుంచి 87 వేల మంది భక్తులకు దర్శనం కల్పిస్తుండగా, ఈ రోజు లక్షన్నర మందికి పైగా భక్తులు తిరుమలకు చేరుకున్నారని తెలిపారు. సాధారణ భక్తులకు ఎక్కువ సమయం కేటాయించేందుకు సోమవారం వీఐపీ బ్రేక్ దర్శనాలు, 800 శ్రీవాణి కరెంట్ బుకింగ్ టికెట్ల కోటాను రద్దు చేశారు. అదనపు పోలీసు బలగాలను మోహరించడంతో పాటు సిబ్బంది సెలవులను కూడా రద్దు చేశారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!