

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న చిత్రాల్లో ‘ఓజీ 2’ ఒకటి. దర్శకుడు సుజీత్ తెరకెక్కించనున్న ఈ భారీ ప్రాజెక్ట్ చుట్టూ తాజాగా కొత్త చర్చ మొదలైంది. మొదటి భాగం సృష్టించిన సంచలనంతో సీక్వెల్‌పై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్న వేళ, నిర్మాణ వ్యవహారాలకు సంబంధించిన పలు ఊహాగానాలు సినీ వర్గాల్లో వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ఇప్పటివరకు ఈ సినిమాకు సంబంధించిన కీలక సమాచారమంతా పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ వైపునుంచే బయటకు రావడం ఆసక్తి రేకెత్తిస్తోంది.
ప్రారంభ దశలో భాగస్వామ్యంగా ఉన్న డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్ నుంచి మాత్రం ఎలాంటి స్పందన కనిపించకపోవడంతో పలు సందేహాలు తలెత్తుతున్నాయి. నిర్మాణ బాధ్యతల్లో మార్పులు జరిగాయా? లేక అధికారిక ప్రకటన కోసం వేచి చూస్తున్నారా? అనే ప్రశ్నలు అభిమానుల్లో చర్చకు దారి తీశాయి. మరోవైపు చిత్రానికి కొత్త పెట్టుబడిదారులు కూడా జతకానున్నారనే ప్రచారం బలంగా వినిపిస్తోంది.
పవన్ కళ్యాణ్ స్వయంగా ఈ ప్రాజెక్ట్ పురోగతిపై ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారనే సమాచారం కూడా ఆసక్తిని పెంచుతోంది. సంగీత బాధ్యతలను థమన్ కొనసాగించనున్నట్టు ఇప్పటికే స్పష్టత వచ్చింది. కథ, నటీనటులు, నిర్మాణ భాగస్వామ్యాలపై పూర్తి వివరాలు త్వరలో వెల్లడయ్యే అవకాశం ఉందని సినీ వర్గాలు చెబుతున్నాయి. అధికారిక ప్రకటన వచ్చే వరకు ఈ ఆసక్తికర చర్చలు కొనసాగేలా కనిపిస్తున్నాయి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!