

టాలీవుడ్‌లో మరో క్రేజీ కాంబినేషన్‌కు రంగం సిద్ధమవుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ప్రముఖ నిర్మాణ సంస్థ డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్, మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయికలో ఓ సినిమా నిర్మించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించి చర్చలు జరుగుతున్నాయని ఇండస్ట్రీ వర్గాల్లో ప్రచారం సాగుతోంది. అన్నీ అనుకున్నట్లు కుదిరితే ఈ కలయికలో ఓ భారీ సినిమా పట్టాలెక్కే అవకాశం ఉంది. చిరంజీవి స్టార్‌డమ్‌కు త్రివిక్రమ్ కథ, మాటలు తోడైతే ప్రేక్షకులకు కొత్త అనుభూతి అందుతుందని అభిమానులు ఆశిస్తున్నారు.
ఇదిలా ఉంటే త్రివిక్రమ్ ఇప్పటికే మరో భారీ ప్రాజెక్ట్‌తో బిజీగా ఉన్నారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కనున్న గాడ్ ఆఫ్ వార్ సినిమాను ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్‌పై ఈ చిత్రం రూపొందనుంది. ఈ నేపథ్యంలో చిరంజీవితో సినిమా చర్చలు నిజమైతే త్రివిక్రమ్ తదుపరి ప్రాజెక్టులపై మరింత ఆసక్తి పెరగడం ఖాయం. ప్రస్తుతం జరుగుతున్న చర్చలు ఏ దిశగా వెళ్తాయో, ఈ క్రేజీ కాంబినేషన్ నిజంగా కార్యరూపం దాల్చుతుందో చూడాలి.



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!