

షారుఖ్ ఖాన్ తన కుమార్తె సుహానా ఖాన్‌కు కీలకమైన సినిమాగా నిలవనున్న కింగ్‌ను ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. దీపికా పదుకొణె, రాణీ ముఖర్జీ వంటి నటీమణులు ఈ చిత్రంలో భాగం కానున్నారనే వార్తలతో ఇప్పటికే సినిమాపై ఆసక్తి పెరిగింది. తాజాగా కరీనా కపూర్ కూడా ఈ సినిమాలో ప్రత్యేక గీతంలో కనిపించనున్నట్లు బాలీవుడ్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. డాడీ కూల్ పేరుతో రూపొందనున్న ఈ పాట చిత్రీకరణ ఈ నెల చివర్లో దక్షిణాఫ్రికాలో జరగనుందని, ఇందుకోసం కరీనా ఐదు రోజుల కాల్షీట్లు ఇచ్చినట్లు కథనాలు వెల్లడిస్తున్నాయి.
షారుఖ్ ఖాన్, కరీనా కపూర్ చివరిసారిగా రావన్ సినిమాలో కలిసి నటించారు. ఇప్పుడు కింగ్‌తో వీరిద్దరూ మళ్లీ తెరపై కనిపించనున్నారనే వార్త అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. గతంలో అశోక, కభీ ఖుషీ కభీ గమ్ చిత్రాల్లో వీరు కలిసి నటించగా, బిల్లు సినిమాలో కరీనా ప్రత్యేక గీతంలో కనిపించారు. అయితే, కింగ్ సినిమాలో కరీనా భాగస్వామ్యం, డాడీ కూల్ పాట చిత్రీకరణ వివరాలపై చిత్ర బృందం నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!