

నటి త్రిష పేరు మరోసారి తమిళనాడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. తిరునల్వేలిలో నవంబర్ 24న ‘ఇళయ పురట్చితలైవి త్రిష పేరవై’ పేరుతో కొత్త అభిమాన సంఘాన్ని ప్రారంభించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ‘ఇళయ పురట్చితలైవి’ అంటే యువ విప్లవ నాయకురాలు అని అర్థం. మాజీ ముఖ్యమంత్రి జయలలితను ‘పురట్చితలైవి’ అని పిలిచేవారు. ఇప్పుడు త్రిష పేరుతో ఇదే తరహా బిరుదుతో అభిమాన సంఘం ఏర్పాటు చేయడం ఆసక్తిని రేకెత్తిస్తోంది. దీంతో ఆమె రాజకీయాల్లోకి వస్తారనే ఊహాగానాలు మళ్లీ మొదలయ్యాయి.
తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్‌తో త్రిష పలు సందర్భాల్లో కనిపించడం కూడా ఆమె రాజకీయ భవిష్యత్తుపై చర్చకు కారణమవుతోంది. అయితే కొత్తగా ఏర్పాటు కానున్న అభిమాన సంఘం వెనుక త్రిష ఉన్నారా? ఆమె అనుమతితోనే ఈ సంఘాన్ని ప్రారంభిస్తున్నారా? అనే విషయాలపై ఇంకా స్పష్టత లేదు. గతంలోనూ ఆమె పేరుతో అభిమాన సంఘం ఏర్పాటు చేసినట్లు ప్రచారం జరిగింది. తాజా పరిణామం రాజకీయ ప్రవేశానికి సంకేతమా లేక అభిమానులు స్వచ్ఛందంగా చేపడుతున్న కార్యక్రమమా అనేది తెలియాల్సి ఉంది. త్రిష మాత్రం ఇప్పటివరకు రాజకీయాల్లోకి వస్తున్నట్లు అధికారికంగా ప్రకటించలేదు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!