

రాకింగ్ స్టార్ యష్ అభిమానులకు ఆసక్తికరమైన వార్త ఒకటి తెరపైకి వచ్చింది. తమిళ దర్శకుడు PS మిత్రన్, యశ్‌తో కలిసి భారీ సాహస చిత్రాన్ని తెరకెక్కించేందుకు సిద్ధమవుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇండియానా జోన్స్ తరహాలో ఉత్కంఠభరితమైన అన్వేషణలు, సాహసాలతో ఈ కథ సాగనుందని సమాచారం. ఇటీవలే దర్శకుడు మిత్రన్ ఈ ప్రాజెక్టుకు సంబంధించిన కథను యశ్‌కు వినిపించగా, ఆయనకు ఆ ఆలోచన బాగా నచ్చినట్లు తెలుస్తోంది. దీంతో ఈ కలయికపై సినీ వర్గాల్లో ఆసక్తి పెరుగుతోంది.
అయితే, ఈ సినిమా పనులు వెంటనే ప్రారంభం కావడం లేదు. ప్రస్తుతం యష్ , నితీష్ తివారీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న రామాయణ చిత్రంలో రావణుడి పాత్ర పోషిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన తన బాధ్యతలను పూర్తి చేసిన తర్వాతే పీఎస్ మిత్రన్ ప్రాజెక్టుపై అధికారికంగా దృష్టి పెట్టనున్నట్లు సమాచారం. ఇప్పటివరకు ఈ వార్తపై చిత్రబృందాల నుంచి అధికారిక ప్రకటన రాలేదు. ఒకవేళ ఈ కలయిక నిజమైతే, యశ్‌ను సరికొత్త సాహస ప్రపంచంలో చూసే అవకాశం అభిమానులకు దక్కనుంది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!