

ప్రస్తుత బిజీ లైఫ్‌స్టైల్‌లో చాలామందికి ఇంట్లో ఆహారం తయారు చేసుకుని తినే సమయం కూడా ఉండటం లేదు. దీంతో జంక్‌ఫుడ్, ప్రాసెస్డ్ ఫుడ్‌పై ఆధారపడటం పెరుగుతోంది. వీటిని తరచుగా తీసుకోవడం వల్ల అధిక కొలెస్ట్రాల్, రక్తంలో చక్కెర స్థాయిలు పెరగడం, అలసట వంటి సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. ఇలాంటి సమయంలో పోషకాలు అధికంగా ఉండే పండ్లను ఆహారంలో భాగంగా చేసుకోవడం ఉపయోగకరంగా ఉంటుంది. ముఖ్యంగా దబ్బపండులో ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు, విటమిన్ సి వంటి పోషకాలు ఉంటాయి.
దబ్బపండులోని పోషకాలు రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో, గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో సహాయపడతాయని చెబుతారు. ఇందులోని యాంటీఆక్సిడెంట్లు శరీరాన్ని ఆక్సిడేటివ్ స్ట్రెస్ నుంచి రక్షించడంలో, విటమిన్ సి రోగనిరోధక వ్యవస్థకు మద్దతు ఇవ్వడంలో ఉపయోగపడుతుంది. ఎరుపు రంగు దబ్బపండులో ఉండే లైకోపీన్ కూడా యాంటీఆక్సిడెంట్‌గా పనిచేస్తుంది. అయితే ఏ ఆహారమైనా మితంగా తీసుకోవడం ముఖ్యం. ఆరోగ్య సమస్యలు ఉన్నవారు ఆహారంలో మార్పులు చేసుకునే ముందు నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!