

అగ్రదర్శకుడు ప్రశాంత్ నీల్ సమర్పిస్తున్న తొలి హరర్ థ్రిల్లర్ చిత్రం ‘418’ ఎట్టకేలకు సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. తీవ్ర భయానక అంశాల కారణంగా ‘418 ది ఫిల్మ్’కు సెన్సార్ అనుమతి పొందడంలో పలుమార్లు తిరస్కరణలు ఎదురయ్యాయి. అనేక దఫాల చర్చలు, ఒప్పించే ప్రయత్నాల అనంతరం ఈ చిత్రానికి సెన్సార్ బోర్డు ‘A’ సర్టిఫికెట్ జారీ చేసింది. ‘సలార్’, ‘డ్రాగన్’ చిత్రాల దర్శకుడు ప్రశాంత్ నీల్ సమర్పిస్తున్న ఈ సినిమా తెలుగు ప్రేక్షకులకు సరికొత్త, తీవ్రమైన హరర్ అనుభూతిని అందించనుందని చిత్ర బృందం చెబుతోంది.
మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి కీర్తన్ నాదగౌడ దర్శకత్వం వహించారు. సెన్సార్ పనులు పూర్తవడంతో తాజాగా ట్రైలర్ విడుదలపై మేకర్స్ అప్డేట్ ఇచ్చారు. ‘ది లాస్ట్ వార్నింగ్’ పేరుతో ట్రైలర్‌ను ఈ నెల 11న సాయంత్రం 4:18 గంటలకు విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. సూర్య రాజ్, చరణ్ లక్కరాజు, ప్రీతి పగడాల ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాతో ప్రేక్షకులకు వెన్నులో వణుకు పుట్టించే అసలైన భయానక అనుభూతిని అందిస్తామని మేకర్స్ చెబుతున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!