
సినిమాలు

హర్ష్ రోషన్, నక్షత్ర జంటగా నటిస్తున్న తాజా యూత్‌ఫుల్ డ్రామా ‘తెల్ల కాగితం’. రమేష్ బండ్రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని అరుణాచల క్రియేషన్స్ బ్యానర్‌పై కృష్ణ కొమ్మలపాటి నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన అప్డేట్స్‌తో సినిమాపై ప్రేక్షకుల్లో మంచి ఆసక్తి నెలకొంది. భారీ అంచనాల మధ్య ఈ చిత్రం అక్టోబర్ 2న ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఈ నేపథ్యంలో ప్రమోషన్స్‌ను వేగవంతం చేసిన మేకర్స్ తాజాగా సెకండ్ సింగిల్‌కు సంబంధించిన అప్డేట్‌ను వెల్లడించారు. ‘ఇది మీకు నేరుగా ఒక ఆత్మీయ ఆలింగనంలా అనిపిస్తుంది’ అంటూ ‘తెలుసా తెలుసా’ పాట ప్రోమోను ఈ నెల 11న ఉదయం 11:07 గంటలకు విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా ఓ రొమాంటిక్ పోస్టర్‌ను కూడా పంచుకున్నారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!