

రెయిన్‌బో సినిమాస్ బ్యానర్‌పై ధనలక్ష్మి బాదర్ల నిర్మాణంలో, వైకుంఠ్ బోను దర్శకత్వంలో రూపొందిన 'వసుదేవసుతం' చిత్రం జూలై 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. మాస్టర్ మహేంద్రన్, అంబికా వాణి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం నుంచి ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, గ్లింప్స్, టీజర్, ట్రైలర్ మంచి స్పందనను అందుకున్నాయి. మ్యూజికల్ ప్రమోషన్స్‌లో భాగంగా తాజాగా 'ఆనందాల వేళ' అనే పాటను లవ్లీ హీరో ఆది విడుదల చేసి చిత్ర బృందానికి అభినందనలు తెలిపారు.
చైతన్య ప్రసాద్ సాహిత్యం అందించిన ఈ పాటను సాయి చరణ్ భాస్కరుణి, శృతిక సముద్రాల ఆలపించగా, మణిశర్మ స్వరాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. కుటుంబ సమేతంగా ఆస్వాదించేలా ఈ పాట రూపొందినట్లు లిరికల్ వీడియోలో కనిపిస్తోంది. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ చిత్రానికి పార్కింగ్ ఫేమ్ జిజ్జు సన్ని సినిమాటోగ్రఫీ అందించగా, జూలై 10న భారీ స్థాయిలో విడుదల చేసేందుకు చిత్ర బృందం సన్నాహాలు చేస్తోంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!