

బాలీవుడ్ సీనియర్ నటి అమీషా పటేల్ పెళ్లి చేసుకోకుండా తన జీవితాన్ని కొనసాగిస్తున్నారు. తన కుటుంబం, స్నేహితులను వదులుకుని ఒక వ్యక్తి కోసం జీవించాలనే ఉద్దేశం తనకు లేదని గతంలో ఆమె స్పష్టం చేశారు. అయితే అమీషా వ్యక్తిగత జీవితం, ప్రేమ, పెళ్లికి సంబంధించిన వార్తలు తరచూ సోషల్ మీడియాలో చర్చనీయాంశమవుతుంటాయి. తాజాగా ముంబయిలో జరిగిన ఓ వేడుకలో భారత క్రికెట్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యాతో ఆమె సన్నిహితంగా మాట్లాడటం, అతని భుజంపై ఆప్యాయంగా చేయి వేయడం కెమెరాలకు చిక్కడంతో ఇద్దరూ డేటింగ్లో ఉన్నారంటూ ప్రచారం మొదలైంది.
ఈ వీడియోను ఓ నెటిజన్ సోషల్ మీడియాలో షేర్ చేస్తూ అమీషా, హార్దిక్ మధ్య ప్రేమాయణం నడుస్తోందంటూ పోస్ట్ చేశారు. దీనిపై అమీషా పటేల్ ఘాటుగా స్పందించారు. ఒక అమ్మాయి స్నేహపూర్వకంగా పలకరించినా, భుజంపై చేయి వేసినా దానికి ప్రేమ, డేటింగ్ అనే అర్థాలు ఎలా వస్తాయని ప్రశ్నించారు. ఇలాంటి ప్రచారం చేయడం కంటే ముందుగా సొంతంగా ఓ గర్ల్‌ఫ్రెండ్‌ను వెతుక్కోవాలని ఆ నెటిజన్‌కు వ్యంగ్యంగా సూచించారు. అమీషా ఇచ్చిన ఈ కౌంటర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!