

బాలీవుడ్ సీనియర్ నటుడు అమితాబ్ బచ్చన్ నటనకు రిటైర్మెంట్ ప్రకటించబోతున్నారంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరిగిన విషయం తెలిసిందే. ఇటీవల ఆయన రాసిన ఓ బ్లాగ్ పోస్ట్‌లో ‘రిటైర్’ అనే పదాన్ని ఉపయోగించడంతో, సినిమాలకు గుడ్‌బై చెప్పే ఆలోచనలో ఉన్నారంటూ వార్తలు వైరల్ అయ్యాయి.
ఈ ప్రచారంపై అమితాబ్ బచ్చన్ స్పందిస్తూ ఓ వార్తాపత్రిక క్లిప్పింగ్‌ను సోషల్ మీడియాలో షేర్ చేశారు. తన బ్లాగ్‌లో రాత్రి చాలా ఆలస్యమైందని, ఇక ‘రిటైర్’ కావాల్సిన సమయం వచ్చిందని రాసిన మాటలను నిద్రపోవడానికి వెళ్లే సమయం వచ్చిందనే అర్థంలో ఉపయోగించినట్లు వివరించారు. అయితే దాన్ని సినిమాలకు రిటైర్మెంట్‌గా ప్రచారం చేయడంపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. తాను ప్రస్తుతం నటనకు దూరం కావడం లేదని, ఇంకా ఎంతో ఉత్సాహంగా పనిచేస్తానని స్పష్టం చేశారు. ప్రస్తుతం ఆయన ‘కౌన్ బనేగా కరోడ్‌పతి’ 18వ సీజన్‌కు హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!