
సినిమాలు

టాలీవుడ్ సినిమా ఈవెంట్లలో తన చురుకైన హోస్టింగ్, స్పాంటేనియస్ స్టైల్‌తో తక్కువ కాలంలోనే మంచి గుర్తింపు తెచ్చుకున్న విజయవాడకు చెందిన యాంకర్ చర్మిల నల్లూరి తన సినీ ప్రయాణంపై ఆసక్తికర విషయాలను వెల్లడించింది. ప్రముఖ నిర్మాతలు అల్లు అరవింద్, ఎంఎస్ రాజు తనకు హీరోయిన్‌గా నటించే అవకాశాలు ఇచ్చినా వాటిని సున్నితంగా తిరస్కరించినట్లు తెలిపింది. నటనపై తనకు ఆసక్తి లేదని స్పష్టం చేసింది.
తల్లిదండ్రులకు సినిమాల్లో నటించడం ఇష్టం లేదని, వారి అభిప్రాయానికి వ్యతిరేకంగా వెళ్లే ఉద్దేశం తనకు లేదని చర్మిల వెల్లడించింది. కేఎల్ యూనివర్సిటీలో బీటెక్ పూర్తి చేసిన ఆమె, విజయవాడ రెడ్ ఎఫ్‌ఎమ్‌లో ఆర్జేగా తన కెరీర్‌ను ప్రారంభించింది. ప్రస్తుతం యాంకరింగ్‌లోనే మరింత ఉన్నత స్థాయికి చేరుకుని తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకోవడమే లక్ష్యమని పేర్కొంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!