

డీజే టిల్లు ఫేమ్ విమల్ కృష్ణ దర్శకత్వంలో రాగ్ మయూర్ హీరోగా తెరకెక్కుతున్న ‘అనుమాన పక్షి’ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. చిలక ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రూపొందుతున్న ఈ చిత్రం ఇప్పటికే ‘గులాబ్ జామ్’ పాటతో ఆసక్తిని రేకెత్తించగా, తాజాగా విడుదలైన టీజర్ మరింత ఆకట్టుకుంటోంది. ప్రతి ఒక్కరిపై అనుమానం పెంచుకునే యువకుడి చుట్టూ కథ తిరుగుతూ, అతని ఊహలు ఎలా విచిత్రమైన పరిస్థితులకు దారి తీస్తాయో హాస్యభరితంగా చూపించారు.
సాధారణ కామెడీ ఫార్మాట్‌కు భిన్నంగా, మానవ ప్రవర్తనలోని విచిత్ర కోణాలను వినోదాత్మకంగా ఆవిష్కరించే ప్రయత్నం చేసినట్లు టీజర్ సూచిస్తోంది. రాగ్ మయూర్ తన కామిక్ టైమింగ్‌తో ఆకట్టుకోగా, మెరిన్ ఫిలిప్, అజయ్-రాశి జంటలు కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. శ్రీచరణ్ పాకాల సంగీతం, సునీల్ కుమార్ నామా విజువల్స్ టీజర్‌కు మరింత ఎనర్జీని జోడించాయి. జూలై 10న ఈ చిత్రం థియేటర్లలో విడుదల కానుంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!