

చిత్రాలయం స్టూడియోస్ బ్యానర్‌పై వేణు దోనేపూడి నిర్మిస్తున్న న్యూ ఏజ్ క్రైమ్ కామెడీ ‘బా బా బ్లాక్ షీప్’. దోనేపూడి చక్రపాణి సమర్పణలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి గుణి మంచికంటి దర్శకత్వం వహిస్తున్నారు. ఓ అనుకోని ఘటన చుట్టూ జరిగే పరిణామాలు పలువురి జీవితాల్లో ఎలాంటి మార్పులకు కారణమయ్యాయనే ఆసక్తికరమైన కథాంశంతో ఈ సినిమాను రూపొందిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్ సినిమాపై అంచనాలను పెంచింది. టిను ఆనంద్, ఉపేంద్ర, జార్జ్ మరియన్, అక్షయ్, కార్తికేయ, విష్ణు, విస్మయశ్రీ, మాళవి, కశ్యప్, రాజా రవీంద్ర తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

దసరా సందర్భంగా అక్టోబర్ 9న సినిమాను గ్రాండ్‌గా విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. తాజాగా ఫస్ట్ లిరికల్ సాంగ్ ‘ఆజా మేరీ జాని’ని రాక్‌స్టార్ దేవిశ్రీ ప్రసాద్ విడుదల చేశారు. అజయ్ లగుసాని, ఓయ్ విష్ణుపై చిత్రీకరించిన ఈ ఎనర్జిటిక్ పార్టీ సాంగ్‌కు ఎలక్ట్రానిక్ కిలి, ఆనంద్ (ఆర్కాడొ) సంగీతం అందించగా, కిట్టు విస్సాప్రగడ సాహిత్యం అందించారు. బెన్నీ దయాల్ ఈ పాటను ఆలపించారు. షూటింగ్ పూర్తయిందని, ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు చివరి దశలో ఉన్నాయని నిర్మాత వేణు దోనేపూడి తెలిపారు. మేఘాలయలో పూర్తిగా చిత్రీకరణ జరుపుకున్న తొలి దక్షిణాది చిత్రంగా ‘బా బా బ్లాక్ షీప్’ ప్రత్యేకతను సొంతం చేసుకుంది. చీరాపుంజి వంటి అద్భుతమైన లొకేషన్లలోనూ చిత్రీకరణ జరిపినట్లు నిర్మాత వెల్లడించారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!