
జనరల్

భాగ్యశ్రీ బోర్సే తక్కువ కాలంలోనే పలు భాషల్లో వరుస అవకాశాలు అందుకుంటూ తన కెరీర్‌ను వేగంగా ముందుకు తీసుకెళ్తున్నారు. తెలుగులో ఆశించిన స్థాయి కమర్షియల్ విజయాలు రాకపోయినా, ఆమె నటనకు మంచి గుర్తింపు లభిస్తోంది. ప్రస్తుతం తమిళంలో శివ కార్తికేయన్తో కలిసి సేయాన్ సినిమాలో నటిస్తున్నారు. అలాగే మలయాళ సినీ పరిశ్రమలోకి కూడా అడుగుపెట్టనున్నట్లు సమాచారం.
మలయాళ స్టార్ హీరో మోహన్‌లాల్ ప్రధాన పాత్రలో విష్ణు మోహన్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాలో కీలక పాత్రలో కనిపించే అవకాశం ఉందని వార్తలు వినిపిస్తున్నాయి. అదేవిధంగా తెలుగులో శర్వానంద్ హీరోగా శ్రీను వైట్ల దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాలో కూడా భాగ్యశ్రీ హీరోయిన్‌గా నటించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ చిత్రాన్ని ‘జార్జ్ రెడ్డి’ అనే టైటిల్‌తో సంక్రాంతికి విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!