

శర్వానంద్ హీరోగా దర్శకుడు సంపత్ నంది తెరకెక్కిస్తున్న మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘భోగి’ ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది. ఈ చిత్రంలో అనుపమ పరమేశ్వరన్, డింపుల్ హయాతి హీరోయిన్లుగా నటిస్తుండగా, కేకే రాధా మోహన్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్న ఈ సినిమా ఆగస్టు 28న ప్రేక్షకుల ముందుకు రానుంది. విడుదల తేదీ సమీపిస్తున్న నేపథ్యంలో చిత్ర బృందం షూటింగ్‌ను వేగంగా పూర్తి చేస్తోంది.
ప్రస్తుతం ‘భోగి’ చిత్రానికి సంబంధించిన కీలక క్లైమాక్స్ ఎపిసోడ్ చిత్రీకరణ జరుగుతున్నట్లు సమాచారం. దాదాపు 20 రోజుల పాటు సాగే ఈ భారీ షెడ్యూల్లో శర్వానంద్ పవర్ఫుల్ యాక్షన్ సన్నివేశాల్లో పాల్గొంటున్నారు. మాస్ యాక్షన్, గ్రాండ్ విజువల్స్‌తో పాటు భావోద్వేగాలను మేళవిస్తూ దర్శకుడు సంపత్ నంది క్లైమాక్స్‌ను ప్రత్యేకంగా రూపొందించినట్లు తెలుస్తోంది. ఈ ఎపిసోడ్ సినిమాకే ప్రధాన ఆకర్షణగా నిలుస్తుందని చిత్ర వర్గాలు విశ్వాసం వ్యక్తం చేస్తున్నాయి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!