

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, దర్శకుడు సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న స్పిరిట్ చిత్రంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. హై-వోల్టేజ్ యాక్షన్ డ్రామాగా రూపొందుతున్న ఈ ప్రాజెక్ట్ ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది. కొద్ది రోజుల విరామం అనంతరం ప్రభాస్ మళ్లీ షూటింగ్‌లో పాల్గొన్నట్లు సమాచారం. ప్రస్తుతం హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్ సిటీలో కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నట్లు సినీ వర్గాలు చెబుతున్నాయి.
ఈ సినిమాపై ఉన్న క్రేజ్‌ను ప్రముఖ టికెటింగ్ ప్లాట్‌ఫామ్ బుక్‌మైషోలో నమోదవుతున్న ఆసక్తి గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. స్పిరిట్ చిత్రానికి ఇప్పటికే 130Kకు పైగా ఇంట్రెస్ట్స్ నమోదైనట్లు సమాచారం. కేవలం పోస్టర్, ఆడియో గ్లింప్స్ మాత్రమే విడుదలైనప్పటికీ ఈ స్థాయి స్పందన రావడం విశేషంగా మారింది. ఇతర భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్‌లతో పోలిస్తే స్పిరిట్ ప్రస్తుతం ముందంజలో ఉండటంతో, ఈ చిత్రం విడుదలకు ముందే భారీ సంచలనం సృష్టిస్తోందని ట్రేడ్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!