

అజయ్ భూపతి దర్శకత్వంలో ఘట్టమనేని జయకృష్ణ హీరోగా రూపొందుతున్న శ్రీనివాస మంగాపురం విడుదలకు సిద్ధమవుతోంది. వచ్చే నెల 9 న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రానికి సంబంధించి చివరి దశ పనులు వేగంగా కొనసాగుతున్నాయి. ఫస్ట్ కాపీని పరిశీలించిన చిత్రబృందం క్లైమాక్స్‌ను మరింత ప్రభావవంతంగా మార్చాలని భావించినట్లు సమాచారం. అందులో భాగంగా కొన్ని కీలక సన్నివేశాలను జోడించేందుకు ఒక రోజు రీషూట్ నిర్వహించనున్నారనే వార్తలు సినీ వర్గాల్లో వినిపిస్తున్నాయి. ఈ మార్పులతో కథకు మరింత బలం చేకూరుతుందని, ప్రేక్షకులకు మరింత భావోద్వేగ అనుభూతి కలిగేలా తీర్చిదిద్దుతున్నారని ప్రచారం జరుగుతోంది.
రీషూట్‌లో హీరో జయకృష్ణతో పాటు ప్రధాన నటీనటులు పాల్గొననున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాకు సంబంధించిన కొన్ని అంశాలపై మహేష్ బాబు చేసిన సూచనలు చిత్రబృందానికి ఉపయోగపడ్డాయని సమాచారం. అశ్వినీ దత్ సమర్పణలో పి. కిరణ్ నిర్మిస్తున్న ఈ చిత్రం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి క్షేత్రం నేపథ్యంలో సాగే కథతో రూపొందుతోంది. విష్ణువు స్వయంభువుగా వెలిసిన క్షేత్రానికి సంబంధించిన అరుదైన సంఘటనను కథాంశంగా తీసుకున్నట్లు ప్రచారం ఉంది. జాతీయ అవార్డు గ్రహీత జి.వి. ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తుండటంతో చిత్రంపై ఇప్పటికే మంచి ఆసక్తి నెలకొంది. విడుదలకు ముందే వినిపిస్తున్న ఈ వార్తలు సినిమాపై అంచనాలను మరింత పెంచుతున్నాయి.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!