

భారతీయ పురాణాల ఆధారంగా ప్రశాంత్ వర్మ తెరకెక్కిస్తున్న ‘మహాకాళి’ చిత్రం వివక్ష, ఆత్మవిశ్వాసం, అంతర్గత శక్తి, తన అసలైన గుర్తింపును తిరిగి పొందడం వంటి అంశాలను ప్రధానంగా చూపించనుంది. ముఖ్యంగా ముదురు చర్మం కారణంగా ఎదురయ్యే వివక్షను కథలో కీలక అంశంగా ప్రస్తావించనున్నట్లు తెలుస్తోంది. తాజాగా విడుదలైన ‘శుక్రాచార్యాస్ వార్ క్రై’ గ్లింప్స్ సినిమాకు సంబంధించిన కథను పూర్తిగా వెల్లడించకుండా, ‘మహాకాళి’ ప్రపంచం ఎంత గ్రాండ్‌గా, డార్క్‌గా ఉండబోతోందో చూపించింది.
గ్లింప్స్‌లో అక్షయ్ ఖన్నా పొడవాటి వెండి గడ్డం, జుట్టుతో, భిన్నమైన రూపంలో శుక్రాచార్యుడిగా కనిపించారు. పురాణాల్లో అసురుల గురువుగా ప్రసిద్ధి చెందిన శుక్రాచార్యుడి పాత్రను ఆయన పోషిస్తున్నారు. మరోవైపు గ్లింప్స్ చివర్లో శ్రియా రెడ్డి పెద్దమ్మ అవతారంలో కనిపించడం ఆసక్తిని పెంచింది. భారీ విజువల్స్, భయానక వాతావరణం, డార్క్ టోన్‌తో రూపొందుతున్న ఈ చిత్రాన్ని 2027 జనవరి 8న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ‘హనుమాన్’ తర్వాత ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ నుంచి వస్తున్న చిత్రంగా ‘మహాకాళి’పై అంచనాలు పెరిగాయి.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!