

కోలీవుడ్ స్టార్ హీరో చియాన్ విక్రమ్ తనయుడు ధృవ్ విక్రమ్ వరుస ఫ్లాప్‌ల తర్వాత బలమైన విజయాన్ని లక్ష్యంగా పెట్టుకుని తన నాలుగో చిత్రాన్ని ప్రారంభించారు. 'ఆదిత్య వర్మ'తో హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆయన, ఇప్పుడు ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్‌తో చేతులు కలిపారు. 'DV4' వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని ఘనంగా పూజా కార్యక్రమాలతో ప్రారంభిస్తూ ఇటీవల వచ్చిన వార్తలకు చిత్రబృందం అధికారికంగా తెరదించింది.
ఈ చిత్రంతో కరణ్ అరవింద్ కుమార్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. నవీన్ యెర్నేని, యలమంచలి రవిశంకర్ ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. పూజా కార్యక్రమానికి కోలీవుడ్ ప్రముఖులు హాజరుకాగా, దర్శకుడు కీర్తీశ్వరన్ తొలి క్లాప్ ఇచ్చారు. తెలుగు, తమిళ భాషల్లో రూపొందనున్న ఈ కమర్షియల్ ఎంటర్టైనర్ రెగ్యులర్ షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుందని చిత్రబృందం వెల్లడించింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!