
జనరల్

‘ఆర్ఎక్స్ 100’ సినిమాతో టాలీవుడ్లో గుర్తింపు తెచ్చుకున్న యువ హీరో కార్తికేయ, ప్రస్తుతం తన కెరీర్లో కొత్త ప్రయోగాలకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఇటీవల ‘భజే వాయు వేగం’ సినిమాతో విజయాన్ని అందుకున్న ఆయన, ఇప్పుడు తన కోసం తానే ఓ కథను సిద్ధం చేస్తున్నారని సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఈ కథ రచన దాదాపు చివరి దశకు చేరుకున్నట్లు తెలుస్తోంది.
అయితే ఈ కథకు కార్తికేయ స్వయంగా దర్శకత్వం వహిస్తాడా? లేక మరో దర్శకుడికి బాధ్యతలు అప్పగిస్తాడా? అనే అంశంపై ఆసక్తి నెలకొంది. ఇటీవల హీరో రామ్ పోతినేని కూడా తనకోసం కథ సిద్ధం చేసి దర్శకత్వ బాధ్యతలు చేపట్టిన నేపథ్యంలో, కార్తికేయ కూడా అదే బాటలో నడుస్తాడా అనే చర్చ ఇండస్ట్రీలో జరుగుతోంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!