

కథానాయిక రష్మిక మందన్న సోషల్ మీడియా ట్రెండ్స్, ఇతరుల అంచనాల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ, తన వ్యక్తిగత జీవితాన్ని ఉన్నది ఉన్నట్లుగా పంచుకోవడం తనకు ఇష్టమని చెప్పారు. సోషల్ మీడియాలో ప్రేక్షకులు చూసే తన వ్యక్తిత్వం నిజ జీవితానికి దగ్గరగా ఉంటుందని తెలిపారు. ట్రెండ్స్‌ను అనుసరిస్తూ ప్రత్యేకమైన ఇమేజ్‌లో ఇమడేందుకు ప్రయత్నించకుండా సహజంగా ఉండటం వల్లే తాను ఇలా ఉండగలుగుతున్నానని పేర్కొన్నారు.
ఇతరుల అంచనాలను అందుకోవాలనే ప్రయత్నంలో సోషల్ మీడియా, ట్రెండ్స్, అభిప్రాయాలు మన అసలైన వ్యక్తిత్వాన్ని కోల్పోయేలా చేస్తాయని రష్మిక అన్నారు. తన దృష్టిలో విజయం అంటే పరిపూర్ణమైన ఇమేజ్‌ను సృష్టించడం కాదని, ఎంత ఎదిగినా మనలాగే ఉంటూ ప్రేక్షకులతో నిజాయతీగా ఉండటమేనని చెప్పారు. నటిగా అంచనాలు, విమర్శలు సహజమేనని, వాటికి ఎలా స్పందించాలో మన చేతుల్లోనే ఉంటుందని తెలిపారు. ‘మైసా’ చిత్రీకరణలో గాయపడిన రష్మిక ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నారు. ఆమె చేతిలో ‘రణబాలి’, ‘మైసా’ చిత్రాలు ఉన్నాయి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!