
టెక్నాలజీ

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న ‘డ్రాగన్’ సినిమాలో నటిస్తున్నారు. ఇటీవల తారక్ పుట్టినరోజు సందర్భంగా విడుదలైన గ్లింప్స్ వీడియోకు అద్భుతమైన స్పందన రావడంతో సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రానికి సంబంధించి హైదరాబాద్‌లో త్వరలో ఒక చిన్న షెడ్యూల్‌ను ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
ఈ షెడ్యూల్ పూర్తైన తర్వాత శ్రీలంకలో భారీ షెడ్యూల్ నిర్వహించనున్నట్లు సమాచారం. వచ్చే నెల నుంచి అక్కడ షూటింగ్ ప్రారంభం కానుంది. ఈ షెడ్యూల్‌లో హీరోయిన్‌గా నటిస్తున్న రుక్మిణి వసంత్‌తో పాటు కీలక పాత్రలో కనిపించనున్న అనిల్ కపూర్ పాల్గొననున్నారు. సంగీతాన్ని రవి బస్రూర్ అందిస్తుండగా, మైత్రీ మూవీ మేకర్స్ మరియు ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లపై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!