
గాసిప్స్

ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో రూపొందుతున్న భారీ యాక్షన్ మూవీ డ్రాగన్ షూటింగ్‌కు తాత్కాలికంగా బ్రేక్ పడింది. షూటింగ్ సమయంలో ఎన్టీఆర్‌కు గాయం కావడంతో చిత్రీకరణను నిలిపివేశారు. ఈ విషయాన్ని నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ ధృవీకరించింది. తారక్ కోలుకునేందుకు కొంత సమయం ఇవ్వడంతో పాటు రెండు వారాల్లో షూటింగ్‌ను తిరిగి ప్రారంభించేందుకు టీమ్ సన్నాహాలు చేస్తోంది.
షూటింగ్‌కు స్వల్ప విరామం వచ్చినప్పటికీ సినిమా రిలీజ్ ప్లాన్‌లో ఎలాంటి మార్పు లేదని మేకర్స్ స్పష్టం చేస్తున్నారు. ఫిబ్రవరి 2027 నాటికి మొత్తం చిత్రీకరణను పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అనంతరం జూన్ 11, 2027న డ్రాగన్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నారు. ఈ చిత్రంలో రుక్మిణి వసంత్, అనీల్ కపూర్ కీలక పాత్రల్లో నటిస్తుండగా, రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!