
జనరల్

గుంటూరు పోలీసుల నిర్లక్ష్యంపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో ఉన్నప్పటికీ పదో తరగతి చదువుతున్న బాలిక ఆచూకీని మూడు నెలలుగా ఎందుకు కనిపెట్టలేకపోయారని పోలీసులను ప్రశ్నించింది. బాలికను వెతికే క్రమంలో సమాచార కమిషనర్‌ను కూడా అడ్డుకున్నారన్న ఆరోపణలపై కోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది.
మూడు నెలలుగా బాలిక ఆచూకీ లభించకపోవడంతో ఆమె తండ్రి హైకోర్టును ఆశ్రయించి హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై విచారణ సందర్భంగా బాలికను రేపటిలోగా కోర్టు ముందు హాజరుపరచాలని రాష్ట్ర డీజీపీని హైకోర్టు ఆదేశించింది. పోలీసుల పనితీరుపై కోర్టు ఘాటు వ్యాఖ్యలు చేస్తూ, ఇలాంటి వ్యవహారం ప్రభుత్వానికే సిగ్గుచేటని పేర్కొంది.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!