

సుమంత్ ప్రభాస్, అనంతిక సనీల్‌కుమార్ జంటగా నటించిన ‘రోమాంచకం’ చిత్రం ప్రేమ, హాస్యం, ఉత్కంఠతో కూడిన యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌గా ప్రేక్షకుల ముందుకు రానుంది. వేణుగోపాల్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని భద్రకాళి పిక్చర్స్‌పై ప్రణయ్ రెడ్డి వంగా నిర్మించగా, సందీప్ రెడ్డి వంగా సమర్పిస్తున్నారు. ఇంజినీరింగ్ పూర్తి చేసిన ఓ యువకుడి జీవితం, అతని ప్రేమకథ, స్నేహితుల మధ్య నెలకొనే సందిగ్ధతల చుట్టూ కథ వినోదాత్మకంగా సాగుతుందని ప్రణయ్ రెడ్డి తెలిపారు. రెండు గంటల 20 నిమిషాల నిడివిలో సినిమా ఎక్కడా బోర్ కొట్టదని, యువతతో పాటు కుటుంబ ప్రేక్షకులు కూడా కలిసి చూడగల చిత్రమని పేర్కొన్నారు.
దర్శకుడు వేణుగోపాల్ రెడ్డి చెప్పిన కథ నచ్చడంతో ఈ ప్రాజెక్ట్‌ను నిర్మించామని ప్రణయ్ రెడ్డి వంగా వెల్లడించారు. సుమంత్ ప్రభాస్, అనంతిక తమ పాత్రల్లో అద్భుతంగా నటించారని, వాసుకి వైభవ్ సంగీతం చిత్రానికి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని చెప్పారు. ఇదే సందర్భంగా ‘అర్జున్ రెడ్డి’లో కొన్ని అదనపు సన్నివేశాలను జోడించి వచ్చే ఏడాది రీ-రిలీజ్ చేయాలని యోచిస్తున్నట్లు తెలిపారు. ప్రభాస్‌తో తెరకెక్కుతున్న ‘స్పిరిట్’ సినిమా షూటింగ్ 40 శాతం పూర్తయిందని, ఆ చిత్రం పూర్తైన తర్వాత కొత్త ప్రాజెక్టులపై ఆలోచిస్తామని పేర్కొన్నారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!