

దుల్కర్ సల్మాన్ ప్రధాన పాత్రలో నహాస్ హిదాయత్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఐ యామ్ గేమ్’ చిత్రం విడుదల వాయిదా పడింది. ముందుగా ఈ సినిమాను ఆగస్టు 20న విడుదల చేయాలని చిత్రబృందం నిర్ణయించింది. అయితే కొన్ని పనులు ఇంకా పూర్తికాకపోవడంతో పాటు తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో ఒకేసారి విడుదల చేయాలనే ఉద్దేశంతో రిలీజ్‌ను వాయిదా వేస్తున్నట్లు దుల్కర్ సల్మాన్ తెలిపారు. సెప్టెంబర్ 3న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుందని వెల్లడించారు.
ఈ సినిమాలో దుల్కర్ సరసన కయాదు లోహర్ కథానాయికగా నటిస్తున్నారు. తమిళ దర్శకుడు మిస్కిన్ కీలక పాత్రలో కనిపించనున్నారు. దక్షిణ భారతదేశంలోని 100కుపైగా ప్రముఖ ప్రాంతాల్లో ఈ చిత్రాన్ని తెరకెక్కించినట్లు సమాచారం. ఇటీవల విడుదలైన ట్రైలర్‌కు ఎన్టీఆర్ ప్రశంసలు అందించారు. ట్రైలర్ అద్భుతంగా ఉందంటూ ఆయన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. పలు భాషల్లో భారీ స్థాయిలో చిత్రాన్ని విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!