

‘బేబీ’ సినిమాతో యువతలో మంచి క్రేజ్ సొంతం చేసుకున్న ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య జోడీ మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. వీరిద్దరూ కలిసి నటిస్తున్న యూత్‌ఫుల్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్ ‘ఎపిక్’. ఆదిత్య హాసన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, శ్రీకర స్టూడియోస్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. అజీమ్ మోహమ్మద్ సంగీతం అందిస్తున్నారు.
‘ఎపిక్’ చిత్రాన్ని తొలుత సెప్టెంబర్ 11న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. అయితే తాజా సమాచారం ప్రకారం, లాంగ్ వీకెండ్‌ను క్యాష్ చేసుకునే ఉద్దేశంతో సినిమాను వారం రోజుల ముందుగానే సెప్టెంబర్ 4న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయాలని చిత్రబృందం భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ రిలీజ్ డేట్ మార్పుపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ‘బేబీ’ తర్వాత ఆనంద్, వైష్ణవి జోడీ మరోసారి కలిసి నటిస్తుండటంతో ‘ఎపిక్’పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!