
షోస్

లండన్ పర్యటన ముగించుకుని హైదరాబాద్‌కు తిరిగి వచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క భేటీ అయ్యారు. సీఎం నగరానికి చేరుకున్న వెంటనే భట్టితో సమావేశం కావడం రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. రాష్ట్రంలో, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీలో చోటుచేసుకుంటున్న తాజా పరిణామాలపై ఇరువురు నేతలు చర్చించినట్లు సమాచారం.
ఈ భేటీలో ప్రధానంగా మంత్రి కొండా సురేఖకు సంబంధించిన వ్యవహారం, పార్టీలో నెలకొన్న పరిస్థితులపై చర్చ జరిగినట్లు తెలుస్తోంది. పార్టీ ఐక్యత, క్రమశిక్షణ, ఇటీవలి రాజకీయ పరిణామాలపై కూడా ఇరువురు నేతలు అభిప్రాయాలు పంచుకున్నట్లు సమాచారం. అయితే సమావేశంలో చర్చించిన అంశాలపై అధికారికంగా ఎలాంటి వివరాలు వెల్లడికాలేదు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!