

న్యూస్ ప్రజెంటర్‌గా కెరీర్ ప్రారంభించి నటిగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ప్రియా భవానీ శంకర్, కోలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు. అయితే తెలుగు చిత్రసీమలో మాత్రం ఆమెకు ఇప్పటివరకు ఆశించిన స్థాయిలో విజయాలు దక్కలేదు. ‘కళ్యాణం కమనీయం’తో టాలీవుడ్‌లో అడుగుపెట్టిన ఆమెకు ఆ చిత్రం పెద్దగా గుర్తింపు తీసుకురాలేదు. అనంతరం ‘భీమా’, ‘జీబ్రా’ వంటి చిత్రాల్లో నటించినప్పటికీ అవి బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితాలు సాధించలేకపోయాయి.
అయినప్పటికీ టాలీవుడ్‌లో ఆమెకు అవకాశాలు కొనసాగుతూనే ఉన్నాయి. ప్రస్తుతం శివ నిర్వాణ దర్శకత్వంలో రవితేజ హీరోగా తెరకెక్కుతున్న ‘ఇరుముడి’ చిత్రంలో ప్రియా భవానీ శంకర్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ చిత్రంలో ఆమె ‘కావేరి’ అనే పాత్రలో, రవితేజకు భార్యగా కనిపించనున్నట్లు సమాచారం. ఆగస్టు 21న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. అలాగే నాగచైతన్య నటించిన ‘దూత’ వెబ్ సిరీస్ రెండో సీజన్‌లో కూడా ఆమె తన పాత్రను కొనసాగించనున్నారు. దీంతో తెలుగు ప్రేక్షకుల్లో మరోసారి తన ముద్ర వేయాలని ప్రియా భవానీ శంకర్ ఆశిస్తున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!