

టాలీవుడ్ యంగ్ హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే వరుస క్రేజీ అవకాశాలతో తన కెరీర్‌ను మరింత వేగంగా ముందుకు తీసుకెళ్తోంది. ఆమె నటించిన కొన్ని చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితాలు అందుకోకపోయినా, ఇండస్ట్రీలో ఆమెకు ఉన్న క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. తెలుగులో ‘ఆంధ్రా కింగ్ తాలూకా’, ‘లెనిన్’ వంటి చిత్రాలతో పాటు, తమిళంలో శివకార్తికేయన్ సరసన ‘సెయాన్’ చిత్రంలో నటిస్తున్న భాగ్యశ్రీ ప్రస్తుతం బిజీగా ఉంది. ఈ క్రమంలోనే ఆమె మాలీవుడ్‌లోకి కూడా అడుగుపెట్టబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
తాజా సమాచారం ప్రకారం, మలయాళ సూపర్ స్టార్ మోహన్‌లాల్ ప్రధాన పాత్రలో తెరకెక్కనున్న భారీ బడ్జెట్ చిత్రంలో భాగ్యశ్రీ బోర్సే కీలక పాత్ర పోషించనున్నట్లు టాక్. దర్శకుడు విష్ణు మోహన్ రూపొందించనున్న ఈ హై-వోల్టేజ్ సర్వైవల్ థ్రిల్లర్ ‘ఆపరేషన్ గంగ’ నేపథ్యంలో సాగనుందని తెలుస్తోంది. రష్యా-ఉక్రెయిన్ యుద్ధ సమయంలో భారతీయులను స్వదేశానికి తీసుకొచ్చిన మిషన్ ఆధారంగా ఈ సినిమా రూపొందనుంది. జార్జియాలో ఆగస్టు మొదటి వారంలో షూటింగ్ ప్రారంభం కానున్నట్లు సమాచారం.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!