

తెలుగు సినీ పరిశ్రమలో 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా నటుడు గోపీచంద్ భావోద్వేగ సందేశాన్ని విడుదల చేశారు. తన సినీ ప్రయాణం వెనుక తన తండ్రి ఆశీస్సులు ఉన్నాయని పేర్కొంటూ, తనను నమ్మిన నిర్మాతలు, దర్శకులు, రచయితలు, సహనటులు, సాంకేతిక నిపుణులు, అలాగే సినీ పరిశ్రమలోని ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. మీడియా, తెలుగు ఫిల్మ్ జర్నలిస్టులు అందించిన మద్దతు, నిజాయితీతో కూడిన అభిప్రాయాలు తన ఎదుగుదలకు ఎంతో దోహదపడ్డాయని అన్నారు.

ఇన్నేళ్లుగా తనపై అభిమానులు, ప్రేక్షకులు చూపించిన ప్రేమ, నమ్మకం, ప్రోత్సాహానికి ఎప్పటికీ రుణపడి ఉంటానని గోపీచంద్ పేర్కొన్నారు. ఈ 25 సంవత్సరాలు తనకు ఎన్నో పాఠాలు, అనుభవాలు, మరపురాని జ్ఞాపకాలను అందించాయని చెబుతూ, భవిష్యత్తులో కూడా మంచి కథలు, నాణ్యమైన నటనతో ప్రేక్షకులను అలరిస్తానని హామీ ఇచ్చారు. త్వరలో భరత వర్ష, సింగా తదితర చిత్రాలతో ప్రేక్షకులను కలుస్తానని వెల్లడించారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!