

నటసింహం నందమూరి బాలకృష్ణ, దర్శకుడు కొరటాల శివ కలయికలో రూపొందనున్న ప్రతిష్ఠాత్మక చిత్రంపై సినీ వర్గాల్లో భారీ చర్చ సాగుతోంది. ఇప్పటికే ప్రీ-ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నాయని సమాచారం. ఈ నెల 25 న అమరావతి సమీపంలోని వెంకటాయపాలెంలో ఉన్న శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయంలో చిత్రాన్ని ఘనంగా ప్రారంభించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ కార్యక్రమానికి సినీ ప్రముఖులతో పాటు రాజకీయ రంగానికి చెందిన ప్రముఖులు హాజరవుతారని ప్రచారం, అభిమానుల్లో ఉత్సాహాన్ని పెంచుతోంది.
ఈ చిత్రంలో బాలకృష్ణ కొత్త అవతారంలో కనిపించనున్నారని టాలీవుడ్ సమాచారం. యాక్షన్‌తో పాటు కుటుంబ భావోద్వేగాలను సమతుల్యంగా మేళవించిన కథను కొరటాల శివ సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ‘దేవర’ తర్వాత ఆయన నుంచి వస్తున్న సినిమా కావడంతో పరిశ్రమ దృష్టి ఈ ప్రాజెక్ట్‌పై నిలిచింది. జూలై రెండో వారంలో తొలి షెడ్యూల్ ప్రారంభం కానుండగా, భారీ యాక్షన్ సన్నివేశాల కోసం ప్రత్యేక సెట్లు నిర్మిస్తున్నారు. మాఫియా నేపథ్యంలో సాగే కథలో బాలయ్య శక్తివంతమైన పాత్రలో కనిపించనున్నారని టాక్. నిర్మాతలు సుధాకర్ చెరుకూరి, సుధాకర్ మిక్కిలినేని అత్యున్నత నిర్మాణ విలువలతో చిత్రాన్ని రూపొందిస్తున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!