

తెలుగులో వరుస సినిమాలకు సంగీతం అందిస్తున్న ప్రముఖ సంగీత దర్శకుడు జి.వి. ప్రకాశ్‌కుమార్.. రవితేజ కథానాయకుడిగా శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఇరుముడి’ తనకు ప్రత్యేకమైన అనుభూతిని ఇచ్చిన సినిమా అని తెలిపారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రం భక్తి, భావోద్వేగం, సైకాలజీ, యాక్షన్ అంశాలను మేళవించిన అరుదైన కథ అని చెప్పారు. ఈ నాలుగు అంశాలను సమపాళ్లలో బ్యాలెన్స్ చేస్తూ సంగీతాన్ని అందించడం పెద్ద సవాల్‌గా నిలిచిందన్నారు. కథలోని మలుపులు అనూహ్యంగా ఉంటాయని, హీరోయిజం కంటే పాత్రలే ప్రధానంగా సాగే కథ అని వివరించారు. ద్వితీయార్ధంలో నేపథ్య సంగీతానికి ఎంతో ప్రాధాన్యత ఉందని, సినిమా ప్రేక్షకులపై గాఢమైన ప్రభావాన్ని చూపుతుందని జి.వి. ప్రకాశ్‌కుమార్ అభిప్రాయపడ్డారు.
సైకాలజికల్ సన్నివేశాలకు సంగీతం అందించడం అంత సులభం కాదని జి.వి. ప్రకాశ్‌కుమార్ తెలిపారు. పాత్రల అంతర్గత సంఘర్షణను సంగీతం ద్వారా చూపించేందుకు ఎక్కువ శబ్దాలు, వాయిద్యాల పొరలు ఉపయోగించకుండా రెండు, మూడు వాయిద్యాలతోనే నేపథ్య సంగీతాన్ని రూపొందించామని చెప్పారు. సినిమాలో మొత్తం ఐదు పాటలు ఉంటాయని, ‘యాలాలో..’ పాట తనకు ఎంతో ఇష్టమని పేర్కొన్నారు. క్లైమాక్స్‌లో రవితేజపై వచ్చే భావోద్వేగ గీతం కూడా ప్రత్యేకంగా ఉంటుందని తెలిపారు. ‘మల్లెపూల పల్లకి’ పాట గత కొన్ని రోజులుగా ట్రెండింగ్‌లో ఉందని చెప్పారు. దర్శకుడు శివ నిర్వాణకు సంగీతం, సాహిత్యంపై మంచి అవగాహన ఉందని, ఆయనతో కలిసి పనిచేయడం ప్రత్యేక అనుభూతిని ఇచ్చిందని జి.వి. ప్రకాశ్‌కుమార్ వెల్లడించారు.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!