
రాజకీయాలు

అల్లు అర్జున్‌కు కేరళలో ఉన్న అభిమాన గణం మరోసారి రుజువైంది. ఆయన నటించిన ‘హ్యాపీ’ చిత్రం రీ రిలీజ్ అయిన తర్వాత కేరళ బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన వసూళ్లు సాధిస్తూ సంచలనం సృష్టిస్తోంది. తొలి రోజు ప్రీమియర్లతో కలిపి ₹35 లక్షలు, రెండో రోజు ₹28 లక్షలు, మూడో రోజు ₹32.5 లక్షలు, నాలుగో రోజు ₹15 లక్షలు వసూలు చేసింది.
మొత్తంగా నాలుగు రోజుల్లో ₹1.10 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించిన ‘హ్యాపీ’ రీ రిలీజ్ చిత్రంగా ప్రత్యేక రికార్డును నమోదు చేసింది. ఇటీవల విడుదలైన కొన్ని భారీ చిత్రాలు కూడా అందుకోలేని స్థాయిలో ఈ సినిమా కలెక్షన్లు నమోదు చేయడం విశేషంగా మారింది. కేరళలో మలయాళీయేతర నటుడిగా అల్లు అర్జున్‌కు ఉన్న అపారమైన ఆదరణను ఈ విజయంతో మరోసారి నిరూపించింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!