

బాలీవుడ్ స్టార్ నటుడు సల్మాన్ ఖాన్కు పాన్ మసాలా ప్రకటన కేసులో పెద్ద ఊరట లభించింది. నేషనల్ కన్స్యూమర్ డిస్ప్యూట్స్ రెడ్రెస్సల్ కమిషన్ (ఎన్‌సీడీఆర్‌సీ) ఆయనపై దిగువ కోర్టులో సాగుతున్న విచారణ ప్రక్రియపై స్టే విధించింది. రాజస్థాన్‌లోని కోట జిల్లా వినియోగదారుల కమిషన్ ఇచ్చిన ఆదేశాలను సవాలు చేస్తూ దాఖలైన అప్పీల్‌పై ఈ తాత్కాలిక స్టే ఉత్తర్వులు జారీ అయ్యాయి.
కేసు వివరాల ప్రకారం, ఇంద్రమోహన్ సింగ్ అనే వ్యక్తి పాన్ మసాలా ప్రకటన ప్రజలను తప్పుదోవ పట్టిస్తోందని ఫిర్యాదు చేశారు. విచారణలో భాగంగా సల్మాన్ ఖాన్‌తో పాటు ఇతరుల సంతకాలను ధృవీకరించాలని జిల్లా ఫోరమ్ ఆదేశించింది. అయితే ఫిర్యాదు చట్టబద్ధతను ముందుగా నిర్ణయించకుండా ఇలాంటి ఆదేశాలు ఇవ్వడంపై సల్మాన్ తరఫు న్యాయవాదులు అభ్యంతరం వ్యక్తం చేశారు. జస్టిస్ ఏపీ సాహి, సభ్యుడు భరత్ కుమార్ పాండ్యాలతో కూడిన బెంచ్ ఈ అంశంపై విచారణ జరిపి, జిల్లా ఫోరమ్ విధానం, అధికార పరిధిపై ప్రశ్నలు లేవనెత్తింది. తదుపరి ఆదేశాలు వచ్చేంతవరకు విచారణ నిలిపివేయాలని ఆదేశిస్తూ స్టే ఇచ్చింది. తదుపరి విచారణను ఈ నెల 22 కు వాయిదా వేసింది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!