

ఒకప్పుడు స్టార్ హీరోల సరసన నటిస్తూ అగ్ర కథానాయికగా గుర్తింపు తెచ్చుకున్న శ్రియా శరణ్ ప్రస్తుతం వరుస అవకాశాలతో తన రెండో ఇన్నింగ్స్‌ను కొనసాగిస్తున్నారు. ఈ ఏడాది విడుదలైన ‘మిరాయ్’ చిత్రంలో ప్రత్యేక పాత్రలో కనిపించి ఆకట్టుకున్న ఆమె.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో సూపర్‌స్టార్ రజనీకాంత్‌తో తన తొలి పరిచయాన్ని గుర్తుచేసుకున్నారు. దర్శకుడు శంకర్ ఒకరోజు ఫోన్ చేసి ఓ సినిమాలో నటిస్తారా అని అడగడంతో తాను వెంటనే అంగీకరించినట్లు తెలిపారు. అనంతరం శంకర్ కార్యాలయానికి వెళ్లినప్పుడు ఏఆర్ రెహమాన్, రజనీకాంత్, సినిమాటోగ్రాఫర్ కె.వి. ఆనంద్ వంటి ప్రముఖులు అక్కడ కనిపించడంతో ఇది భారీ సినిమా అని భావించినట్లు చెప్పారు.
అయితే అక్కడే శంకర్ తన సహనటుడు రజనీకాంత్‌ను కలవాలని చెప్పడంతో తాను ఆశ్చర్యపోయానని శ్రీయా శరణ్ తెలిపారు. సూపర్‌స్టార్‌తో కలిసి నటించబోతున్నానని అప్పటివరకు తనకు తెలియదని, రజనీకాంత్‌ను సహనటుడిగా పరిచయం చేసిన క్షణం తనకు షాక్ కలిగించిందని చెప్పారు. అలా ‘శివాజీ’ సినిమా ప్రాజెక్ట్ ప్రారంభమైందని, ఆ సినిమా ఎంత పెద్ద స్థాయిలో ఉండబోతుందో అక్కడ ఉన్న ప్రముఖులను చూసిన తర్వాతే తనకు అర్థమైందని ఆనాటి జ్ఞాపకాలను పంచుకున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!