

సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ప్రతిష్టాత్మక పీరియాడిక్ డివైన్ డ్రామా ‘సంబరాల ఏటి గట్టు’ డబ్బింగ్ పనులు పూజా కార్యక్రమంతో అధికారికంగా ప్రారంభమయ్యాయి. రోహిత్ కేపీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై కె. నిరంజన్‌రెడ్డి నిర్మిస్తున్నారు. ప్రస్తుతం సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. కథ, కథనంతో పాటు అద్భుతమైన విజువల్స్‌తో ప్రేక్షకులకు ప్రత్యేకమైన సినీ అనుభూతిని అందించేందుకు చిత్రబృందం భారీ స్థాయిలో తెరకెక్కిస్తోంది.
‘సంబరాల ఏటి గట్టు’ను ప్రేక్షకులకు ఒక గ్రాండ్ విజువల్ స్పెక్టకిల్‌గా అందించేందుకు మేకర్స్ ప్రత్యేకంగా ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే సినిమాపై ఆసక్తి నెలకొన్న నేపథ్యంలో డబ్బింగ్ పనులు ప్రారంభం కావడం విశేషంగా మారింది. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 12న ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేయనున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. దీంతో సాయి ధరమ్ తేజ్ అభిమానులతో పాటు సినీ ప్రేక్షకుల్లోనూ ఈ సినిమాపై అంచనాలు పెరుగుతున్నాయి.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!