

సూపర్‌స్టార్ రజనీకాంత్ నటించిన జైలర్ 2 మరో అరుదైన ఘనత సాధించింది. రూ.800 కోట్ల వసూళ్ల మార్కును దాటిన తొలి కోలీవుడ్ చిత్రంగా నిలిచినట్లు వార్తలు వస్తున్నాయి. నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా తమిళ చిత్ర పరిశ్రమలో ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. మరోవైపు, ఈ సినిమా కన్నడ డబ్బింగ్ వెర్షన్ కూడా సరికొత్త రికార్డు సృష్టించింది. అల్లు అర్జున్ నటించిన పుష్ప 2: ది రూల్ రికార్డును అధిగమించి, అత్యధిక వసూళ్లు సాధించిన కన్నడ డబ్బింగ్ చిత్రంగా నిలిచినట్లు సమాచారం. ఇప్పటివరకు కన్నడ వెర్షన్ ద్వారా సుమారు రూ.9.5 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించగా, ఫుల్ రన్‌లో ఈ మొత్తం రూ.10 కోట్లకు పైగా చేరే అవకాశముంది.
అయితే, జైలర్ 2 నెలకొల్పిన ఈ రికార్డు ఎక్కువ రోజులు కొనసాగకపోవచ్చనే చర్చ జరుగుతోంది. ఈ శుక్రవారం థియేటర్లలోకి రానున్న రామాయణం ఆ రికార్డును బద్దలు కొట్టే అవకాశం ఉందని అంచనాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా యశ్‌కు కర్ణాటకలో ఉన్న భారీ క్రేజ్ ఈ సినిమాకు కలిసొస్తుందని భావిస్తున్నారు. ఇప్పటికే రామాయణం కన్నడ వెర్షన్ అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా సుమారు రూ.3 కోట్ల వసూళ్లు సాధించినట్లు సమాచారం. సినిమా విడుదలకు ఇంకా రెండు రోజులు సమయం ఉండటంతో ఈ వసూళ్లు మరింత పెరిగే అవకాశం ఉంది. విడుదలైన రెండు రోజుల్లోనే జైలర్ 2 రికార్డును రామాయణం అధిగమిస్తుందా అనేది ఆసక్తికరంగా మారింది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!