

తమిళ స్టార్ హీరో విజయ్ కుమారుడు జాసన్ సంజయ్ దర్శకుడిగా పరిచయమవుతున్న ‘సిగ్మా’ ప్రీరిలీజ్ వేడుక హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. సందీప్ కిషన్ హీరోగా తెరకెక్కిన ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్ ఈవెంట్‌కు మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా జాసన్ సంజయ్ చిరంజీవికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. తన తొలి సినిమా వేడుకకు చిరంజీవి రావడం డ్రీమ్ కమ్ ట్రూ మూమెంట్ అని, ఆయన అందించిన సపోర్ట్‌ను ఎప్పటికీ మర్చిపోలేనని భావోద్వేగంతో చెప్పారు.
నటుడిగా కాకుండా దర్శకుడిగా కెరీర్‌ను ఎంచుకోవడానికి గల కారణాలను కూడా జాసన్ సంజయ్ వెల్లడించారు. చిన్నప్పటి నుంచే కథలు చెప్పడం, స్క్రిప్టులు రాయడంపై ఆసక్తి ఉండటంతో దర్శకత్వం వైపు అడుగులు వేసినట్లు తెలిపారు. హీరో సందీప్ కిషన్ అందించిన సహకారానికి కృతజ్ఞతలు చెబుతూ, ‘సిగ్మా’ ప్రేక్షకులకు కొత్త తరహా విజువల్ అనుభూతితో పాటు ఉత్కంఠభరితమైన యాక్షన్ సన్నివేశాలను అందిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ సినిమా అక్టోబర్ 2న థియేటర్లలో విడుదల కానుంది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!